ఆస్పత్రిలో నర్సులతో కలిసి చిందులేసిన వైద్యులు

70చూసినవారు
ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సులతో కలిసి వైద్యులు చిందులేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లా ఆస్పత్రి స్టాఫ్ రూంలో చోటు చేసుకుంది. యూపీలోని ఝాన్సీ ఆస్పత్రి ప్రమాదంలో 10 మంది చిన్నారులు సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువకముందే వైద్యులు, నర్సులు ఓ ప్రమోషన్ పార్టీలో పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్