గిరిజన విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తులు

50చూసినవారు
గిరిజన విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తులు
బుట్టాయగూడెం మండలం ఇప్పలపాడు ఏకలవ్య విద్యాలయంలో 11వ తరగతి (సీబీఎస్ఈ సిలబస్)లో ఖాళీగా ఉన్న సీట్లలో చేరేందుకు జిల్లాలోని అర్హులైన గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఐటీడీఏ పీవో సూర్యతేజ శుక్రవారం తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, హెచ్ఐపీ గ్రూపుల్లో 35 సీట్లు ఉన్నాయన్నారు. ఈ నెల 18లోగా దరఖాస్తులు అందజేయాలని, పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్