పోలవరం మండలం వెంకటరెడ్డిగూడెంలో సురేంద్రదొర(26) మనస్తాపంతో పురుగుల మందు తాగి శుక్రవారం మృతి చెందాడు. నిత్య మద్యం సేవిస్తూ కుటుంబ బాధ్యతలు విస్మరించడంపై భార్యతో తరచూ గొడవలు జరిగేవి. ఈనేపథ్యంలో పురుగులమందు తాగిన అతడిని మొదట పోలవరం ఆరోగ్య కేంద్రానికి, తరువాత రాజమహేంద్రవరానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య ఇంద్రజ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఏఎస్సై నాగేశ్వరరావు తెలిపారు.