పోలవరం నియోజకవర్గంలో ఉన్న పలు ప్రధాన సమస్యల గురించి శాసనసభలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శనివారం మాట్లాడారు. ఐటీడీఏకి బడ్జెట్లో నిధులు కేటాయించినందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. ఐటీడీఏకి నూతన పీవోని నియమించాలని తెలిపారు, ఐటీడీఏ ద్వారా గిరిజన యువతకు ఉపాధి కల్పించాలని, ట్రైకార్ లోన్స్ గిరిజనులకు అందించాలని తెలిపారు.