ఆరోగ్య నియమాలు పాటించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునని తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వై. వి. లక్ష్మణ రావు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం వెంకట్రామన్నగూడెం ప్రాధమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని కుంచనపల్లి గ్రామములో ఆరోగ్య నియమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఆరోగ్య సిబ్బంది దానమ్మ, ఎం. ఎల్. హెచ్. పి. శ్రవన్య, అంగన్వాడీ సిబ్బంది, ఆశాలు ఉన్నారు.