విజయవాడ వరద బాధితుల సహాయార్ధం వారికి నిత్యావసర సరుకులను, బియ్యం, కూరగాయలను అందించేందుకు ఉంగుటూరు మండలం నీలాద్రిపురం కూటమి పార్టీల శ్రేణులు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు క్యాంపు కార్యాలయం వద్ద శుక్రవారం జెండా ఊపి ఈ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నిత్యావసర సరుకుల ట్రాక్టర్లలో వారు విజయవాడ బయలుదేరటం జరిగింది.