AP: చిత్తూరు జిల్లా పులిచర్ల మండలంలో దారుణ హత్య జరిగింది. ఆవులపెద్దిరెడ్డిగారిపల్లెకు చెందిన ప్రభాకర్ రెడ్డి అనే రైతు హత్యకు గురయ్యారు. అరికలవారిపల్లె భాస్కర్ కుటుంబంతో ప్రభాకర్ రెడ్డికి పొలం వివాదం కొనసాగుతుంది. పొలంలో పని చేస్తున్న ప్రభాకర్‌పై భాస్కర్ కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ప్రభాకర్ రెడ్డి ప్రాణాలు విడిచారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.