AP: ఏలూరు జిల్లా కామవరపుకోటలోని మారుతీనగర్‌లో జరిగిన కోడి పందేల బరిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒక పందెం గెలుపు, ఓటముల మధ్య వివాదం తలెత్తింది. ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదరకపోవడంతో కుర్చీలు, కర్రలతో దాడి చేసుకున్నారు. దాంతో నిర్వాహకులు లైట్లు ఆపి పందేలను నిలిపివేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు.