ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. లోతట్టు, పెన్నా నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రకాశంలో 4, నెల్లూరు 6, అన్నమయ్య జిల్లాలోని 3 మండలాల్లో వర్షప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొంది.