అవిభక్త కవలలైన వీణ, వాణికి రెండేళ్ల పాటు వైద్యుడు నాయుడమ్మ చికిత్స అందించారు. అనంతరం 2006లో హైదరాబాద్ నీలోఫర్ అసుపత్రికి తరలించారు. ఇద్దరిని వేరు చేసేందుకు ముంబయిలోని బ్రీచ్‌కండీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మూడు నెలల పాటు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి ఆపరేషన్ చేయకుండా వైద్యులు చేతులెత్తేశారు. పలు దేశాలకు చెందిన ప్రఖ్యాత వైద్యులు ఆపరేషన్ చేసేందుకు ముందుకు వచ్చినా.. వేరు చేస్తే ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని తేల్చడంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు.