అవిభక్త కవలలు వీణ-వాణీల స్వగ్రామం తెలంగాణ రాష్టం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం. మారగాని మురళీ, నాగలక్ష్మి దంపతులకు 2002 అక్టోబర్ 16న వీరు పుట్టారు. సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జన్మించిన వీరు జన్మతహా రెండు తలలు అతుక్కుని జన్మించారు.