టీడీపీ రెబల్ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు

80చూసినవారు
టీడీపీ రెబల్ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు
2024 ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కీలక ఘట్టం ముగిసింది. ఈ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ, ఉపసంహరణకు సంబంధించిన గడువు సోమవారం ముగిసింది. దీంతో గుర్తింపు పొంది పార్టీ అభ్యర్థులతో పాటు రెబల్ అభ్యర్థులకు అధికారులు గుర్తులను కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ రెబల్ అభ్యర్థి అయిన మీసాల గీతకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. దీంతో టీడీపీ నేతలు ఆమెకు గాజు గ్లాసు గుర్తును కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.