VIDEO.. రోడ్డుపైనే బాలుడికి సీపీఆర్‌

83చూసినవారు
విజయవాడ అయ్యప్పనగర్‌కు చెందిన సాయి అనే ఆరేళ్ల బాలుడు సాయి మే 5వ తేదీ సాయంత్రం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. అదే సమయంలో మెడ్‌సీ ఆసుపత్రిలో ప్రసూతి వైద్య నిపుణురాలైన రవళి అటుగా వస్తూ.. వారిని చూశారు. ఏమైందని అడగటంతో తల్లిదండ్రులు విషయం చెప్పారు. వైద్యురాలు బాలుడిని పరీక్షించి.. అక్కడే రోడ్డుపైనే పడుకోబెట్టమని చెప్పారు. అనంతరం సీపీఆర్‌ చేయడం ప్రారంభించారు. ఇలా.. ఏడు నిమిషాలకు పైగా చేశాక.. బాలుడిలో కదలిక వచ్చింది. వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్