AP: కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి డిసెంబరు చివరి వారంలో ఫిజికల్ టెస్ట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్ శనివారం ప్రకటన విడుదల చేశారు. దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలకు నవంబరు 11 నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల మధ్య వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.