AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీజేఐ నుంచి మరో ధర్మాసనానికి పిటిషన్ విచారణలో మార్పు జరిగింది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు పిటిషన్ వేశారు. విచారణ హైదరాబాద్ నుంచి మరో రాష్ట్రానికి మార్చాలని మరో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.