తమిళనాడులోని మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం 108 సేవలను బైక్ ద్వారా కూడా ఇచ్చేందుకు నిర్ణయించింది. మొత్తం 10 జిల్లాల్లో 58 గ్రామాలకు 25 బైక్ అంబులెన్స్‌లను మంజూరుచేసి ఆయా గ్రామాల పరిధిలోకి పంపింది. దీంతో ఆయా మారుమూల ప్రాంతాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.