మహిళతో GST అధికారి అసభ్య ప్రవర్తన

67చూసినవారు
మహిళతో GST అధికారి అసభ్య ప్రవర్తన
AP: జీఎస్టీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న మహిళతో ఓ అధికారి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విజయవాడకు చెందిన ఓ మహిళ పుట్టగొడుగుల వ్యాపారం కోసం జీఎస్టీ లైసెన్స్ దరఖాస్తు చేసుకున్నారు. వెరిఫికేషన్ చేయాలని గొల్లపూడి సర్కిల్‌కు చెందిన ఓ జీఎస్టీ అధికారికి బాధ్యతలు అప్పగించారు. లైసెన్స్ మంజూరుకు ఆ అధికారి రూ.10 వేలు లంచం తీసుకున్నారు. ఆ తర్వాత మహిళ కారులోనే ఎక్కి అసభ్యంగా ప్రవర్తించారు. దీనిపై మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్