స్వచ్ఛత హి సేవాలో భాగంగా గురువారం కమ్యూట్ ఆన్ సైకిల్ డే నిర్వహిస్తున్నట్లు గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రజలు తమ దినచర్యలో కేవలం సైకిల్ మాత్రమే వినియోగించి కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. స్వచ్ఛత హి సేవలో అక్టోబర్ 2 వరకు ప్రతి రోజు స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ అంశాలపై ఒక ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేశామని చెప్పారు.