గుంటూరు నగరంలో డిశంబర్ 10వ తేదీలోపు వెండింగ్ జోన్లను ఏర్పాటు చేస్తామని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. గుంటూరు జీఎంసీ కార్యాలయంలో సోమవారం కమిషనర్ మాట్లాడారు. ఇప్పటికే స్ట్రీట్ వెండర్లతో సమావేశం ఏర్పాటు చేశామని, ఈ నేపథ్యంలోనే విక్రయదారుల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నామని చెప్పారు. ప్రజాప్రతినిధుల పలుకుబడితో దుకాణాలకు అనుమతులు ఇస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు.