దోమలు కుట్టకుండా జాగ్రత్తలు పాటించాలి: విజయలక్ష్మి

77చూసినవారు
దోమలు కుట్టకుండా జాగ్రత్తలు పాటించాలి: విజయలక్ష్మి
దోమలు కుట్టకుండా చూసుకుంటే మలేరియా రాకుండా నివారించుకోవచ్చని గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి విజయలక్ష్మి గురువారం తెలిపారు. ఇంటి చుట్టు పక్కల నీరు నిల్వ లేకుండా చూడాలని, కిటికీలకు తెరలు వేసుకోవాలని, దోమ తెరలు వాడుకోవడం ఉత్తమమని ఆమె పేర్కొన్నారు. జ్వర పీడితులు సమీపంలోని ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్