గుంటూరు జిల్లా రూరల్ మండలం నల్లపాడు గ్రామం లో శనివారం నాలుగో విడత వైయస్సార్ ఆసరా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ బాలసాని కిరణకుమార్ పాల్గొని లబ్ధిదారులకు ఆసరా చెక్కు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళా పక్షపాతి సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో వైయస్సార్ పార్టీ మహిళా లోకం బలపర్చాలని కోరారు. ఎంపీటీసీలు, సర్పంచులు అధికారులు పాల్గొన్నారు.