అద్దంకి: ట్రాఫిక్ క్రమబద్దీకరణను పరిశీలించిన డిఎస్పి

58చూసినవారు
అద్దంకి: ట్రాఫిక్ క్రమబద్దీకరణను పరిశీలించిన డిఎస్పి
అద్దంకి పట్టణంలో భవాని సెంటర్ నందు ట్రాఫిక్ క్రమబద్ధీకరణను ఆదివారం డిఎస్పి మహమ్మద్ మెయిన్ పర్యవేక్షించారు. ట్రాఫిక్ సమస్యకు తీసుకుంటున్న చర్యలను గురించి ఆయన సీఐ కృష్ణయ్య ను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో నైట్ పెట్రోలింగ్ పై డిఎస్పి ఆరా తీశారు. పకడ్బందీగా నైట్ పెట్రోలింగ్ ను నిర్వహించాలని ఆయన సూచించారు. ఏమైనా సమస్య ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్