TG: హైదరాబాద్‌లో రూ. 110 కోట్లకు పైగా చిట్టిల పేరుతో మోసానికి పాల్పడ్డ తాపీ మెస్త్రి పుల్లయ్య కుటుంబం ఇంకా పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారం రోజులు దాటుతున్న ఆచూకీ దొరకడం లేదు. పుల్లయ్య, కుటుంబ సభ్యుల ఫోన్లు స్విచాఫ్ వస్తుండగా, కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరుకు పారిపోయి ఉండవచ్చని బాధితులు ఆరోపిస్తున్నారు. పుల్లయ్య మోసంతో ఇద్దరు బాధిత మహిళలు ఆత్మహత్యయత్నం చేసినట్లు తెలుస్తోంది.