TG: హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ హోటల్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. షాన్‌బాగ్ హోటల్‌లోని ఐదో అంతస్తులో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ మంటలు భవనం అంతా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.