Jan 26, 2025, 09:01 IST/
రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ దే: CM రేవంత్
Jan 26, 2025, 09:01 IST
రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ దేనని CM రేవంత్ అన్నారు. నారాయణపేట(D) చంద్రపంచ సభలో 4 పథకాలను సీఎం ప్రారంభించి మాట్లాడారు. 'రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీయే. వ్యవసాయానికి మాత్రమే ఉచిత కరెంట్ కాదు.. పేదలకు కూడా ఉచిత విద్యుత్ ఇస్తున్న ఘనత కాంగ్రెస్ దే. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నాం' అని వ్యాఖ్యానించారు.