జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు పోలీసులు మృతి

74చూసినవారు
జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు పోలీసులు మృతి
జమ్మూకశ్మీర్‌లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌ కౌంటర్‌ జరిగింది. కాగా ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పోలీసులు వీరమరణం పొందగా.. ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. అలాగే ఐదుగురు భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్