AP: విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యంతో కవలలు మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా మాకరపాలేనికి చెందిన లక్ష్మి గర్భవతి కాగా 9 నెలలుగా విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే లక్ష్మికి ప్రసవ నొప్పులు రాగా.. ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స అందిస్తున్నప్పుడు.. కవలలు మరణించారని, తల్లి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వెంటనే KGHకు తరలించాగా లక్ష్మి మృతి చెందింది.