బాపట్ల జిల్లాలో పంటల సాగు, ఉత్పత్తుల విస్తీర్ణం, ఆదాయం మరింత పెరగాలని జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి తెలిపారు. వివిధ శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్ లో సమావేశమయ్యారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయంపై రైతులు మక్కువ చూపేలా అవగాహన కల్పించాలన్నారు. తద్వారా రైతులకు, ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించాలన్నారు. ప్రోటీన్ రైస్ ఉత్పత్తిని పెంచేలా చూడాలన్నారు. వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.