అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధం

54చూసినవారు
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం గణపవరం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదంలో పూరిల్లు దగ్ధమైంది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన కుటుంబరావు ఇంటిలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగి పూరింటికి అంటుకొని దగ్ధమైందని తెలిపారు. ప్రమాదానికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్