బాపట్ల మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం బాపట్ల పట్టణంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ హాజరయ్యారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ మాట్లాడుతూ అక్టోబర్ 2వతేదీ వరకు జరిగే స్వచ్ఛతాహి సేవకార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పరిసరాల పరిశుభ్రతతే కార్యక్రమం లక్ష్యమన్నారు.