బాపట్ల మండల పరిధిలోని సూర్యలంక సముద్రతీరం వద్ద కార్తీక పౌర్ణమి సందర్భంగా చేసినటువంటి ఏర్పాట్లను బాపట్ల మండల తాహసిల్దార్ సలీమా మంగళవారం సాయంత్రం పర్యవేక్షించారు. కార్తిక పౌర్ణమి దృష్టియా సూర్యలంక తీర ప్రాంతానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. పర్యవేక్షణలో తాసిల్దార్ తో పాటు పిఓపిఆర్డి శరత్ బాబు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భాష కూడా ఉన్నారు.