బాపట్ల: లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్

72చూసినవారు
బాపట్ల: లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్
బాపట్ల పురపాలక సంఘం పరిధిలోని లోతట్టు ప్రాంతమైన 5 వ వార్డు లో బుధవారం కమీషనర్ జి. రఘునాథ రెడ్డి సిబ్బంది కలిసి పర్యటించారు. అధిక వర్షాల కారణంగా వార్డులోని ప్రాంతాలలో నిలిచియున్న నీటిని రేపు మోటార్ల ద్వారా తరలించాలని ఇంజనీరింగ్ విభాగ అధికారులను కమిషనర్ ఆదేశించారు. వర్ష ప్రభావానికి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఆయన వెంట అసిస్టెంట్ ఇంజనీర్ ప్రసాద రావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్