లంక గ్రామాల్లోని రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
కృష్ణానది వరదల కారణంగా లంక గ్రామాలలో వాణిజ్య పంటలను కోల్పోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పి. నాగాంజనేయులు, సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు గొట్టుముక్కల బాలాజీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం భట్టిప్రోలు మండల పరిధిలోని పెదపులివర్రు, చింతమోటు గ్రామాలలో వరద ముంపుకు గురై దెబ్బతిన్న పంటలను సిపిఐ బృందం పరిశీలించారు.