వైసిపి ప్రభుత్వంలో దాడులు చేసినా పట్టించుకోని పోలీసులు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మా పైనే పోలీసులు జులుం చూపిస్తున్నారని, టిడిపి రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా శనివారం విమర్శించారు. భట్టిప్రోలు మండలంలో వైసిపి ఇన్చార్జి వరికూటి అశోక్ బాబు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు మధ్య రాజకీయం వేడెక్కింది.