ఐలవరంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
భట్టిప్రోలు మండల పరిధిలోని లవరం గ్రామానికి చెందిన పద్మశాలీయ సంఘీయులు శ్రీ లీలాభవాని పద్మశాలీయ బహూత్తమసంఘం (గోవాడ) వారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర, సంక్రాంతి, మహాశివరాత్రి శుభాకాంక్షలతో ఏర్పాటు చేసిన నూతన క్యాలెండర్ ను మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.