చిలకలూరిపేటలోని ఐసీఐసీఐ బ్యాంకులో గురువారం సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. ఇటీవల బ్యాంకులో రూ. కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల సొమ్ము గల్లంతు అక్రమాలను నిగ్గు తేల్చేందుకు సీఐడీ అధికారులు బ్యాంకులో సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో బ్యాంకులోని సిబ్బంది, ఖాతాదారులను అధికారులు విచారిచారించారు. కాగా డిపాజిట్ సొమ్ముతో మేనేజర్ నరేశ్, అప్రైజర్ హరీశ్ పరారైన విషయం తెలిసిందే.