పర్చూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అక్కయ్యచౌదరి కుటుంబంలో మరో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. రెండురోజుల క్రితం అక్కయ్యచౌదరి మరణించగా అంత్యక్రియలు ముగిసి 24 గంటలు కాకముందే ఆయన అల్లుడు మారెళ్ళ సదాశివరావు(49) చిన్నగంజాం టోల్ ప్లాజా వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కయ్య చౌదరి కుటుంబం కుప్పకూలిపోయింది. చీరాల ఎమ్మెల్యే కొండయ్య వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు.