రోడ్డు సగంలో ఆగిపోతే.. ప్రయాణం ఎట్టా?
అధ్వాన రహదారితో ఎన్నో ఏళ్లుగా అవస్థలు పడుతున్న దుగ్గిరాల ప్రజలకు రోడ్డు పనులు మొదలు పెట్టారనే సంతోషం మూన్నాళ్ల ముచ్చటే అయింది. స్థానిక పాత లాకు జెండా చెట్టు నుంచి కొత్త లాకు గ్యాస్ కంపెనీ వరకూ రోడ్డు వేస్తారని నాయకులు ప్రకటించారు. ఆ మేరకు గుంతలుగా ఉన్న తారు రోడ్డును జెండా చెట్టు నుంచి తవ్వడం మొదలు పెట్టారు. పొక్లెయి న్‌తో మూడు రోజులు పని చేసి సొసైటీ వరకు వచ్చాక ఆపేశారు. వెంటనే పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.