తిరుమల లడ్డూ వివాదం.. ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్

61చూసినవారు
తిరుమల లడ్డూ వివాదం.. ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్
తిరుమల లడ్డూ వ్యవహారంలో ప్రకాష్‌రాజ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. 'ప్రకాష్‌రాజ్‌ మీరు ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదు. నాలాంటి కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయాలని ఇప్పటికే కోరారు. ఇందులో మతపరమైన వ్యాఖ్యలు ఎక్కడున్నాయి? #మీ పరిధుల్లో మీరు ఉండండి.' అని మంచు విష్ణు ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్