కోరిన కోరికలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులు పరమపవిత్రంగా భావిస్తారు. తిరుమలలో 1803వ సంవత్సరంలో తరువాత తీపి బూందీ ఇచ్చేవారు. ఈ ప్రసాదమే కాలక్రమేణా లడ్డుగా మారింది. 1940ల్లో కల్యాణం అయ్యంగార్ లడ్డు ప్రసాదానికి రూపకల్పన చేశారు. ఇక తిరుమల అంటే లడ్డు ప్రసాదం అని పేరు వచ్చింది. తిరుమల లడ్డూ తయారీలో శెనగపిండి, చక్కెర, జీడిపప్పు, యాలకులు, ఆవు నెయ్యి, కలకండ, ఎండుద్రాక్ష.. తదితర పదార్థాలు వినియోగిస్తారు.