మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ పరిధి బరేలా పోలీస్ స్టేషన్‌లో సెప్టెంబర్ 18న షాకింగ్ ఘటన జరిగింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా జరిగిన ఓ వివాదంపై బెనీలాల్ పటేల్ అనే వృద్ధుడిని పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. అసభ్యపదజాలంతో పోలీసులు ఆయనను దూషించి, దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఘర్షణ జరిగింది. పోలీసులతో వాగ్వాదం జరుగుతుండగానే గుండెపోటుతో బెనీలాల్ కుప్పకూలాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయాడు.