వివాహాది శుభకార్యాలయాలలో పూలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇక కొబ్బరి, పామాయిల్, జామ, దానిమ్మ, నారింజ తదితర తోటల్లో పలువురు రైతులు అంతర పంటగా కనకాంబరం సాగు చేపడుతున్నారు. వాతావరణంలో హెచ్చుతగ్గులను ఇవి తట్టుకుంటాయి. ఇవి సంవత్సరం పొడవునా పూలు పూస్తాయి. కనకాంబరం సాగు చేపట్టే రైతులకు లాభాలు ఆర్జిస్తున్నారు. ఎకరానికి 2500ల కిలోల వరకు దిగుబడి వస్తుంది. మార్కెట్‌లో వీటికి ప్రస్తుతం కిలో రూ.700 - రూ.1000 వరకు ధర పలుకుతోంది.