Mar 21, 2025, 18:03 IST/
రేపే ఐపీఎల్ తొలి మ్యాచ్.. కోల్కతాలో వర్షం (వీడియో)
Mar 21, 2025, 18:03 IST
ఐపీఎల్ 2025 సీజన్లో కేకేఆర్, ఆర్సీబీ మధ్య శనివారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఎందుకంటే శుక్రవారం రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డన్స్ మైదానంలో వర్షం కురిసింది. రేపు మ్యాచ్ జరిగే సమయానికి వర్షం పడే అవకాశాలు 90 శాతం ఉన్నాయని వాతావరణ నివేదికలు ఇదివరకే స్పష్టం చేశాయి. ఈ క్రమంలో రేపటి IPL ఓపెనింగ్ సెర్మనీ దాదాపుగా రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.