దుర్గి మండల పరిధిలోని అడిగొప్పల నిదానంపాటి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నిదానంపాటి అమ్మవారి దేవాలయంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి కుటుంబ సభ్యులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పూలదండలు సమర్పించారు.