గుంటూరు: మద్యం విక్రయిస్తున్న ఇద్దరు నిందితులు అరెస్ట్

74చూసినవారు
గుంటూరు: మద్యం విక్రయిస్తున్న ఇద్దరు నిందితులు అరెస్ట్
తెలంగాణకు చెందిన మద్యాన్ని విక్రయిస్తున్న ఇద్దరిని గుంటూరు ఎక్సైజ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల మేరకు గుంటూరు నల్లచెరువు కు చెందిన ఇంతియాజ్, లాలుపురం కు చెందిన శ్రీనివాసరావు తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం సీసాలను తీసుకువచ్చారు. బుధవారం పొన్నూరు రోడ్డులో విక్రయిస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న సీఐ లతా, ఎస్ఐ తిరుమలేశ్వర్రావు, షరీఫ్లు తమ సిబ్బందితో వెళ్లి నిందితులను అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్