జీఎంసీ పరిధిలో నవంబర్ నెలాఖరు నాటికి రోడ్ల ప్యాచ్ వర్క్ లు పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. బుధవారం గుంటూరు నగరంలో జరుగుతున్న మరమ్మత్తుల పనులపై డివిజన్ ల వారీగా ఇంజినీరింగ్ అధికారులతో కమిషనర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 3 వేల వరకు ప్యాచ్లు, రోడ్ మరమత్తులను చేయాల్సి ఉందని ఇప్పటికి 1,200 పనులు పూర్తి చేసుకున్నామని చెప్పారు.