Oct 19, 2024, 02:10 IST/కరీంనగర్
కరీంనగర్
కొత్తపల్లి: ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే ప్రథమ లక్ష్యం: నరేందర్ రెడ్డి
Oct 19, 2024, 02:10 IST
నిరుద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల సమస్యలను లేవనెత్తి పట్టభద్రుల గొంతుకనవుతానని ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. కొత్తపల్లి మండలం చింతకుంట సాంఘిక సంక్షేమ పాఠశాలలో శుక్రవారం ఆయన ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులు రానున్న ఎన్నికల్లో తనకు మద్దతు పలకాలని కోరారు. నిరుద్యోగులకు అండగా ఉంటానని, పెద్దల సభలో చట్టాల రూపకల్పనలో ముందుంటానన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే ఆయన లక్ష్యమన్నారు.