Feb 24, 2025, 03:02 IST/మంథని
మంథని
పెద్దపల్లి: మల్లన్న సన్నిధిలో మొదలైన బ్రహ్మోత్సవాలు
Feb 24, 2025, 03:02 IST
పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ప్రారంభం అయినాయి. ఉదయం గణపతి పూజ, శివపుణ్యా వచనం, కలశ స్థాపన , మంటపరాధన పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వీరభద్రయ్య మాట్లాడుతూ సోమవారం ఉదయం 10 గంటలకు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.