కోడిపందేలు వేయకుండా పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

50చూసినవారు
కోడిపందేలు వేయకుండా పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్
గుంటూరు వెస్ట్: సంక్రాంతిని పుస్కరించుకుని జిల్లాలో కోడి పందేలు ఆడేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు కోడి పందాలు నివారించేందుకు ప్రత్యేక నిఘా కమిటీలు వేశారని, రెవెన్యూ, పోలీసు, స్థానిక సిబ్బందితోపాటు జంతు ప్రేమికుల సహకారంతో ఎక్కడైనా జరిగితే కఠినంగా వ్యవహరించాలన్నారు. నిఘా బృందాలు ఈ నెల18వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. స్థానికులు కూడా తమకు సహకరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి రాష్ట్ర సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో సమావేశానికి స్థానిక కలెక్టరేట్ నుంచి జేసీ
జి.రాజకుమారి, అసిస్టెంట్ కలెక్టర్ శివన్నారాయణ శర్మ, డీఆర్వో చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్