గుంటూరు నగరాభివృద్ధి అందరి బాధ్యత: కమిషనర్

51చూసినవారు
గుంటూరు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుకోవడంలో కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్ పాత్ర కీలకమని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో బుధవారం అధికారులు, ట్రాఫిక్ అధికారులు, కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్ యజమానులతో వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక సమావేశం జరిగింది. నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, అందుకు తగిన విధంగా స్వచ్ఛత కోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్